Rashmika - వాక్సిన్ వచ్చేవరకు అది తినదట

Tuesday,September 22,2020 - 01:11 by Z_CLU

టాలీవుడ్ హాట్ బ్యూటీ రష్మిక ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆ స్ట్రీట్ ఫుడ్ ను ఆమె చాలా మిస్ అవుతోందట.

Rashmika Favorite Street Food పానీపూరి. దాదాపు వారంలో 5 రోజులు పానీ పూరి తింటుందట రష్మిక. కానీ లాక్ డౌన్ వల్ల పానీ పూరికి పూర్తిగా దూరమయ్యానని చెబుతోంది. ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ ఔట్ లెట్స్ తెరిచినప్పటికీ.. కరోనా వాక్సీన్ వచ్చేంతవరకు పానీ పూరి తిననని చెబుతోంది ఈ బ్యూటీ.

మరోవైపు ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లో పాన్-కేక్స్ తయారుచేయడం నేర్చుకుందట రష్మిక. ఈ సీజన్ లో తన ఫేవరెట్ ఫుడ్ అదేనని చెబుతోంది. అంతేకాదు… ఈ సందర్భంగా తన Eating Style కూడా చెబుతోంది.

అన్నం, పప్పు, కూర, చారు ఇలా వన్ బై వన్ తినడం Rashmika కు ఇష్టం ఉండదట. ఓ గిన్నెలో అన్నీ మిక్స్ చేసి ఒకేసారి లాగించేస్తుందట. టైమ్ సేవ్ అవ్వడంతో పాటు టేస్టీగా కూడా ఉంటుందని చెబుతోంది.