హ్యాట్రిక్ హిట్ కి రెడీ అయిన కన్నడ బ్యూటీ

Sunday,September 23,2018 - 04:00 by Z_CLU

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న కన్నడ బ్యూటీ రష్మిక లేటెస్ట్ మూవీ ‘దేవదాస్’… అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27 న థియేటర్స్ లోకి రానుంది.. నాగ్-నాని కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా రూపొందిన ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించింది రష్మిక.. తెలుగులో చేసిన ‘ఛలో’,’గీత గోవిందం’ రెండు సినిమాలు సూపర్ హిట్స్ సాదించి రష్మిక ను లక్కీ బ్యూటీ గా మార్చేసాయి.

ఇప్పుడు అదే లక్ తో దేవదాస్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తుంది రష్మిక. ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ హిట్టయితే రష్మిక కి ఇక తెలుగులో తిరుగే ఉండదు.