Rashmika - ఆ క్లబ్ లో చేరిపోయింది

Thursday,January 07,2021 - 03:08 by Z_CLU

టాలీవుడ్ లో స్టేటస్ సింబల్ ఏంటి? దీనికి రకరకాల సమాధానాలున్నాయి. కానీ అందరూ ఆమోదించిన ఏకైక సమాధానం Range Rover. అవును.. ఈ కారు ఉంటే ఇండస్ట్రీలో స్టేటస్ దానంతట అదే వస్తుంది. ఇప్పుడీ కార్ లిస్ట్ లోకి రష్మిక (Rashmika) కూడా చేరిపోయింది.

బ్రాండ్ న్యూ లగ్జరీ రేంజ్ రోవర్ ను సొంతం చేసుకుంది రష్మిక. ఈ న్యూ ఇయర్ కు తనకుతానుగా ఇచ్చుకున్న కాస్ట్ లీ గిఫ్ట్ ఇది. అంతేకాదు.. ఈ Range Rover చుట్టూ చాలా ప్రత్యేకతలున్నాయి.

rashmika-range-rover-car

హైదరాబాద్ లో రష్మిక కొనుక్కున్న మొట్టమొదటి కారు ఇది. ఇన్నాళ్లూ ఆమె తన సినిమాల ప్రొడక్షన్ కంపెనీలు ఇచ్చిన కార్లను వాడింది. ఇప్పుడిలా సొంతంగా కారు కొనుక్కుంది. అంతేకాదు.. ఆమె ఇప్పుడు హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది కూడా. ఓ అపార్ట్ మెంట్ లో లగ్జరీ ఫ్లాట్ తీసుకుంది.

సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాల సక్సెస్ తర్వాత రష్మిక తన రెమ్యూనరేషన్ కాస్త పెంచింది. ప్రస్తుతం టాలీవుడ్ లో హయ్యస్ట్ పెయిడ్ హీరోయిన్స్ లో రష్మిక కూడా ఉంది. ఈ ఏడాది ఆమె బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది.