నో డేట్స్ అంటున్న రష్మిక

Wednesday,June 24,2020 - 12:33 by Z_CLU

వరుస విజయాలు అందుకున్న హీరోయిన్ కి క్రేజీ ఆఫర్లు రావడం సహజమే. ఇప్పుడు రష్మిక కి అలాంటి ఆఫర్లే చుట్టుముడుతున్నాయి. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ తో మంచి విజయం అందుకున్న ఈ కన్నడ బ్యూటీ వెంటనే ‘భీష్మ’ తో మరో విజయం అందుకుంది. దీంతో అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నాయి.

కానీ అవి స్వీకరించి డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేదు రష్మిక. అవును… సరిలేరు నీకెవ్వరు కంటే ముందే సుకుమార్ నెక్స్ట్ సినిమాకు సంతకం చేసి బల్క్ డేట్స్ కి ఒకే చెప్పేసింది లక్కీ బ్యూటీ.

అయితే సుకుమార్ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడింది. దీంతో రష్మిక కి మరో సినిమా చేసే అవకాశం లేకపోయింది.

సో.. ప్రస్తుతం కమిట్ అయిన ‘పుష్ప’ సినిమా పూర్తయ్యాకే మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉంది. అందుకే టాలీవుడ్ లో ఎన్ని ఆఫర్లు వస్తున్నా రిజెక్ట్ చేస్తుందని సమాచారం.