ఫస్ట్ టైమ్ ప్రేక్షకులు నా డాన్స్ చూశారు

Tuesday,January 14,2020 - 01:25 by Z_CLU

ఇప్పటివరకు తను పెద్దగా డాన్స్ చేయలేదని, సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఫస్ట్ టైమ్ ఆడియన్స్ తన డాన్స్ చూశారని అంటోంది రష్మిక. ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాల్ని మీడియాతో షేర్ చేసుకుంది.

– నేను డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు ఆ సన్నివేశాలు చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. షూటింగ్‌ చేస్తున్నప్పుడే టీమ్‌ అంతా బాగా నవ్వుకున్నాం. ఇప్పుడు థియేటర్లలో ప్రేక్షకులు కూడా ఆ కామెడీ ట్రాక్‌ని పూర్తిగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

– మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ షూటింగ్ రోజు ఈ అమ్మాయికి డ్యాన్స్‌ వచ్చో, రాదో అనే సందేహం అందరికీ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నేను పెద్దగా డాన్స్ చేయలేదు. కానీ ఒక చిన్న డ్యాన్స్‌ బిట్‌ చేసి చూపించాను. అందరూ ఎగ్జైట్‌ అయ్యారు. అలా మహేశ్‌గారితో డ్యాన్స్‌ చేయడం చాలా ఎంజాయ్‌ చేశాను. థియేటర్లో ఈ సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి నాకే ఆశ్చర్యంగా ఉంది.

– మహేశ్‌తో ఎవరు హీరోయిన్‌గా చేసినా సితార వారికి ఫ్రెండ్‌ అయిపోతుంది. ఈ సినిమాకి కూడా సితార, నేను, ఆద్య ఒక గ్యాంగ్‌. మా ముగ్గురిలో ఎవరితో మాట్లాడాలన్నా మిగతా ఇద్దరికి తెలియాల్సిందే.