రాశిఖన్నా ఇంటర్వ్యూ

Monday,January 29,2018 - 04:44 by Z_CLU

ఫిబ్రవరి 2 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది మాస్ మహారాజ్ ‘టచ్ చేసి చూడు’. విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రాశిఖన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుంది. ఆ చిట్ చాట్ మీ కోసం…

సినిమాలో నా క్యారెక్టర్…

ఈ సినిమాలో నా పేరు పుష్ప. మామూలుగా రవితేజ సినిమాలనగానే హీరోయిన్స్ కి జస్ట్ గ్లామర్ రోల్స్ అనుకుంటారు కానీ ఈ సినిమాలో నాది ఇంపార్టెంట్ రోల్. కామిక్ టచ్ ఉన్న క్యారెక్టరైజేషన్. రవితేజ, నా కాంబినేషన్ లో ఉండే సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి.

 

అదే బెస్ట్ కాంప్లిమెంట్

డబ్బింగ్ అయ్యాక రవితేజ గారు కాల్ చేసి సినిమా ఫస్టాఫ్ లో నువ్వే హైలెట్ అవుతున్నావ్, అంత బాగా పర్ఫామ్ చేశావు అని చెప్పారు. అది నాకు బెస్ట్ కాంప్లిమెంట్…

చాలా బావుంది…

రవితేజ గారు చాలా ఎనర్జిటిక్ పర్సన్ అని అందరికీ తెలుసు. సెట్స్ లో చాల జోవియల్ గా ఉంటారు. లోపలేదో పెట్టుకుని బయట ఇంకోలా ఉండే మైండ్ సెట్ కాదు ఆయనది. ఆయనతో వర్క్ చేసే చాన్స్ వస్తే మళ్ళీ చేస్తాను.

నాకోసమే తగ్గాను….

వెయిట్ నా కోసమే తగ్గాను. ఇక్కడైతే ఇలాగే బావున్నాను అంటారు, అదే కోలీవుడ్ కి వెళ్తే అయ్యో ఎందుకు తగ్గావు అంటారు… సో ఎవరి కోసమో కాదు, నా కోసమే నేను తగ్గాను…

అప్పుడు వేరు ఇప్పుడు వేరు…

రవితేజ గారితో బెంగాల్ టైగర్ లో చేసినప్పుడు, అప్పుడు నేను అంత పర్ఫెక్ట్ కాదు, సిగ్గు పడుతూ ఉండేదాన్ని, ఇప్పుడు కంప్లీట్ యాక్ట్రెస్ ని అయ్యాను అని ఫీలింగ్…

ప్రాక్టీస్ చేశాను…

ఈ సినిమాలో డ్యాన్స్ టీచర్ గా చేశాను. ఒక సీక్వెన్స్ కోసం వన్ వీక్ ప్రాక్టీస్ చేశాను. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను.

అంత టైమ్ లేదు…

ఈ సినిమాకే కాదు ‘తొలిప్రేమ’కు కూడా నా డబ్బింగ్ నేనే చెప్పాలనుకున్నా. కానీ అస్సలు టైమ్ కుదరలేదు. 2 సినిమాలు ఒకేసారి రెడీ అవ్వడం, దానికి తోడు నేను తమిళ సినిమాలు కూడా చేస్తున్నాను కాబట్టి అటూ ఇటూ టైమ్ మ్యానేజ్ అవ్వడం లేదు.

లక్కీగా ఫీల్ అవుతున్నా…

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డిఫెరెంట్ డిఫెరెంట్ రోల్స్ తో, నాట్ ఓన్లీ గ్లామరస్ రోల్స్ బట్ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. చాలా హ్యాప్పీ….

బాడీ షేమింగ్ ని పట్టించుకోను…

ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఒకరికి లావుగా ఉంటే నచ్చరు, కొందరికి సన్నగా ఉంటే నచ్చరు. నేను బాడీ షేమింగ్ ని హార్ట్ వరకు తీసుకోను. నేనే కాదు ఎవరూ తీసుకోకపోవడమే బెటర్. మనకు నచ్చినట్టు, కంఫర్ట్ గా ఉండాలి. అదే నేను నమ్మేది…

 

కాంపిటీషన్ ఉండదు…

అందరూ అనుకున్నట్టు హీరోయిన్స్ మధ్య కాంపిటీటివ్ ఫీలింగ్ ఏమీ ఉడవు. నాకు రకుల్, లావణ్య అందరూ ఫ్రెండ్సే…

జెన్యూన్ కాంప్లిమెంట్స్ తక్కువే…

దేనినీ పెద్దగా పట్టించుకోను. ముఖ్యంగా నెగెటివ్ కామెంట్స్ కి. ఎవరైనా పొగిడితే బావుంటుంది కానీ, సోషల్ మీడియాలో జెన్యూన్ కాంప్లిమెంట్స్ కూడా తక్కువే.

చాన్స్ దొరకలేదు…

నయనతార తో సినిమా చేస్తున్నాను. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ సినిమాలో తనతో స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ దొరకలేదు. ఈ సినిమా ఏప్రియల్ లో రిలీజవుతుంది. జయం రవి తో కూడా ఒక సినిమా చేస్తున్నా. అది కూడా మ్యాగ్జిమం ఏప్రియల్ లో రిలీజవుతుంది.