రేర్ అండ్ రోరింగ్ కాంబో

Saturday,October 08,2016 - 09:00 by Z_CLU

 తెలుగు తెరపై మల్టీస్టారర్స్ చేసే మేజిక్ మామూలుగా ఉండదు. మంచి కథ దొరకాలే కానీ మన హీరోలు మల్టీ స్టారర్స్ కి మడమ తిప్పే చాన్సే ఉండదు. ఇటు ప్రేక్షకుల్లోనూ మల్టీ స్టారర్స్ అంటే మంచి క్రేజ్ ఉంది. కానీ అన్ని మల్టీ స్టారర్స్ కెల్లా మెగా నందమూరి కాంబినేషన్ కి ఉన్న క్రేజే ఊహకు అందనిది.

నందమూరి, మెగా హీరోలను ఒక వేదికపై చూడటం కూడా అరుదే. బన్నీ, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపిస్తేనే కిర్రాక్ అయిపోయారు జనాలు. అలాంటిది నందమూరి కళ్యాణ్ రామ్, మెగా హీరో సాయి ధరం తేజ్ ఒకే సినిమాలో నటించనున్నారు.  A.S. రవికుమార్ దర్శకత్వం వహిస్తాడు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు ఈ సినిమా నిర్మిస్తారు.

   రవి కుమార్ కథ చెప్పగానే ఇంప్రెస్ అయిన కళ్యాణ్ రామ్, మరో హీరో సాయి ధరమ్ తేజ్ అయితే బావుంటుందని సజెస్ట్ చేశాడని సమాచారం. సాయి ధరం తేజ్ కి కూడా ఆ కథ నచ్చడంతో వెంటనే ఓకే అనేశాడట.