రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్
Tuesday,May 16,2017 - 05:30 by Z_CLU
ఇప్పటికే ట్రేలర్ తో ఎట్రాక్ట్ చేస్తున్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీ.. ఆడియో రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ కోసం ఆల్రెడీ ఏర్పాట్లు బిగిన్ చేసేసింది సినిమా యూనిట్. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన రెండు పాటలు సోషల్ మీడియాలో మ్యాగ్జిమం స్పేస్ ని ఆక్యుపై చేసుకున్నాయి. రేపు ‘భ్రమరాంబ కి నచ్చేశాను’ అనే సాంగ్ ని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్న సినిమా యూనిట్, ఈ పాటలతో పాటు మిగతా పాటల్ని ఆడియో ఫంక్షన్ లో గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటోందట.
ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ఈ నెల 18 న సినిమా యూనిట్ ఈ కలర్ ఫుల్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండే స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. దానికి తోడు ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్ కూడా యాడ్ అయితే ఆల్రెడీ సినిమాపై క్రియేట్ అయిన హైప్ పీక్ కి వెళ్ళడం ఖాయం. నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో… అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఈనెల 26న థియేటర్లలోకి రానుంది.