రేపే రారండోయ్ పాటల వేడుక

Wednesday,May 17,2017 - 04:31 by Z_CLU

నాగచైతన్య-రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈనెల 26న విడుదల చేయబోతున్నారు. రేపు ఈ సినిమా ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. దీనికోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లుచేశారు. రేపు సాయంత్రం సరిగ్గా 7 గంటలకు రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ ప్రారంభమౌతుంది. ఈ వేడుకను జీ తెలుగు, జీ సినిమాలు ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.

నాగచైతన్య, రకుల్ కాంబోలో ఇదే మొదటి చిత్రం. అటు సోగ్గాడే చిన్నినాయనా లాంటి సూపర్ హిట్ తర్వాత కల్యాణ్ కృష్ణ చేస్తున్న మూవీ కూడా ఇదే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రయిలర్ కు  మంచి రెస్పాస్ వచ్చింది. చైతూ-రకుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుందనే టాక్ రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి.

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. సోషల్ మీడియాలో ఇప్పటికే విడుదలైన 3 పాటలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. వీటితో పాటు మిగిలిన పాటల్ని రేపు అట్టహాసంగా విడుదల చేయబోతున్నారు.