“రారండోయ్..” ట్రయిలర్ రిలీజ్ రేపే

Friday,May 12,2017 - 02:00 by Z_CLU

నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రారండోయ్ వేడుక చూద్దాం రోజుకో రిలీజ్ తో హంగామా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 2 సింగిల్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు థియేట్రికల్ ట్రయిలర్ కూడా లాంచ్ చేయబోతున్నారు. రేపు ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ కానుంది. ఈ విషయాన్ని నాగచైతన్య స్వయంగా ఎనౌన్స్ చేశాడు. పనిలో పనిగా మరో బ్రాండ్ న్యూ స్టిల్ కూడా రిలీజ్ చేశాడు.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.  కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన టైటిల్ సాంగ్ సూపర్ గా క్లిక్ అయింది.

కింగ్ నాగార్జున నటించిన నిన్నే పెళ్లాడతా, మన్మధుడు సినిమాల టైపులో రారండోయ్ వేడుకచూద్దాం మూవీ ఉంటుంది. చైతూ-రకుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. ఆ బజ్ ఇంకా కొనసాగుతుండగానే.. మరో రొమాంటిక్ సింగల్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ డబుల్ చేశారు.

సినిమాలో నాగచైతన్యకు తండ్రిగా జగపతిబాబు నటించారు. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాల కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కింది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ 2 హిట్స్ కొట్టిన నాగచైతన్య.. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.