రారండోయ్ పాటలు విందాం

Wednesday,May 03,2017 - 11:41 by Z_CLU

రారండోయ్ వేడుక చూద్దాం అంటూ ఊరిస్తున్న నాగచైతన్య, రారండోయ్ పాటలు విందాం అంటూ ఆహ్వానిస్తున్నాడు. తన కొత్త సినిమా పాటల్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన చైతూ, ఈ శనివారం నుంచి ఆ పాటల వేడుక ప్రారంభమౌతుందని ప్రకటించాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలోని ఫస్ట్ సింగ్ ను శనివారం రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నిన్నే పెళ్లాడతా సినిమా ఛాయల్లో కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 13న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సెలబ్రేట్ చేసి, 19న మూవీని థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్. ఈ ఇయర్ నాగచైతన్యకు ఇదే ఫస్ట్ మూవీ.