పుకార్లపై ఫైర్ అయిన సీనియర్ నటుడు

Sunday,May 31,2020 - 03:49 by Z_CLU

సినీజనాలకు పుకార్లు కొత్తకాదు. కొంతమంది వాటిని ఖండిస్తారు, మరికొంతమంది లైట్ తీసుకుంటారు. కానీ కొన్ని పుకార్లు హద్దులు దాటుతాయి. సెలబ్రిటీలకు కోపం తెప్పిస్తాయి. అలాంటిదే ఓ రూమర్ రావురమేష్ కు ఆగ్రహం తెప్పించింది. అతడిపై ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు కొందరు. దీనిపై రావు రమేష్ మండిపడ్డాడు.

“మీడియా మిత్రులకు, నన్ను , నా నటనను అభిమానించే ప్రతి ఒక్కరికీ…నాకు ఏ సోషల్ మీడియా లో ఏటువంటి అకౌంట్స్ లేవు, ఫేస్ బుక్ గానీ, ట్విట్టర్ గానీ , ఇన్ స్ట్రాగ్రామ్ ఇలా ఏమీ లేవు.. ఈ రోజు నా పేరు మీద ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు…ఆ పోస్టులు కు గానీ , ఆ అకౌంట్ కు గానీ నాకు ఎటువంటి సంబంధం లేదు..దయచేసి వాటిని నమ్మకండి…ఏమైనా ఉంటే పత్రికాముఖంగా నేనే తెలియజేస్తాను.. త్వరలోనే నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టబోతు న్నాను.”

ఇలా తనపై వస్తున్న ఫేక్ పోస్టులపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు రావు రమేష్.