కపిల్ ట్రేడ్ మార్క్ షాట్ తో రణ్వీర్ సింగ్

Monday,November 11,2019 - 12:40 by Z_CLU

భార‌త‌దేశ క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 ఏడాదిని మ‌ర‌చిపోలేం. క‌పిల్ దేవ్ నాయ‌క‌త్వంలో అప్పటి తిరుగులేని వెస్టీండిస్ టీమ్‌పై విజ‌యాన్ని సాధించిన క్రికెట్ విశ్వ‌విజేత‌గా భార‌త‌దేశం ఆవిర్భ‌వించిన సంవ‌త్స‌ర‌మది. ఈ ఆసాధార‌ణ ప్ర‌యాణాన్ని వెండితెర‌పై `83` సినిమాగా ఆవిష్క‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. `83` చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సినిమా కోసం ర‌ణ్వీర్ సింగ్ క‌పిల్‌దేవ్‌లా మేకోవ‌ర్ అయ్యారు. ఫ్యాన్స్ కోసం క‌పిల్‌దేవ్‌లా ఉన్న ర‌ణ్వీర్ సింగ్ లుక్‌ను చిత్రీ యూనిట్ విడుద‌ల చేసింది. అది కూడా ఆయ‌న ట్రేడ్ మార్క్ క్రికెట్ షాట్ న‌ట‌రాజ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో ట‌న్‌బ్రిడ్జ్‌లో జింబాబ్వేతో ఆడిన మ్యాచ్‌లో కపిల్ దేవ్ 175 ప‌రుగుల‌ను సాధించారు. క్రికెట్ చ‌రిత్ర‌లో ఈ మ్యాచ్ మ‌ర‌పురాని మ్యాచ్‌గా నిలిచిపోయింది. సాంకేతిక కార‌ణాల‌తో ఈ మ్యాచ్ లైవ్‌లో ప్ర‌సారం కాలేదు. రికార్డు కూడా కాలేదు.

ఈ చిత్రంలో క‌పిల్ డేర్ డెవిల్స్‌ సాధించిన విజ‌యాల‌ను అద్భుతంగా చిత్రీక‌రించారు. ముంబైలో రీసెంట్‌గా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో క‌పిల్‌దేవ్‌లా ర‌ణ‌వీర్ సింగ్ నటించాడు. క‌పిల్‌దేవ్ భార్య రోమీ పాత్ర‌లో దీపికా ప‌దుకొనె అతిథిపాత్ర‌లో న‌టిస్తోంది.