కపిల్ దేవ్ గా రణ్వీర్.. ఫస్ట్ లుక్ అదుర్స్

Saturday,July 06,2019 - 03:08 by Z_CLU

భారత్ కి మొదటి క్రికెట్ ప్రపంచకప్ అందించిన లెజెండరీ క్రికెటర్ కెప్టెన్ కపిల్ దేవ్. ఈయన క్రీడా జీవితం బాలీవుడ్ లో బయోపిక్ గా తెరకెక్కుతోంది. “83” పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో కపిల్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. దీపికా పదుకొనె ఆయన భార్య పాత్రలో నటిస్తుంది.

ఈరోజు రణ్వీర్ సింగ్ బర్త్ డే. ఈ సందర్భంగా “83” ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వరల్డ్ కప్ టైమ్ లో కపిల్ ఎలా ఉండేవాడో, దాదాపు అదే లుక్ లో కనిపిస్తున్నాడు రణ్వీర్. హెయిర్ స్టయిల్ నుంచి లుక్స్ వరకు అన్నీ సరిపోయాయి.

కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, విబ్రి మీడియా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయబోతున్నారు.