'రంగులరాట్నం' ట్రయిలర్ రిలీజ్

Wednesday,January 03,2018 - 05:36 by Z_CLU

సంక్రాంతి బరిలో నిలిచిన ‘రంగులరాట్నం’ సినిమాకు సంబంధించి ఇవాళ్టి నుంచి అఫీషియల్ ప్రమోషన్ ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేశారు. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది ‘రంగులరాట్నం’ సినిమా.

కొత్త దర్శకురాలు శ్రీరంజని తెరకెక్కించిన ఈ సినిమా ఫ్రెష్ గా ఉండబోతోందనే విషయం ట్రయిలర్ చూస్తేనే తెలుస్తోంది. ప్రతి సీన్, డైలాగ్ కొత్తగా కనిపిస్తోంది. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రయిలర్ కు ఓ రొమాంటిక్ ఫీల్ తీసుకొచ్చింది.


అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు నాగార్జున నిర్మాత. ఇదే బ్యానర్ పై వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాడు రాజ్ తరుణ్. మళ్లీ ఇన్నేళ్లకు అన్నపూర్ణ బ్యానర్ లో రంగులరాట్నం చేశాడు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.