'రంగులరాట్నం' గ్రాండ్ రిలీజ్

Sunday,January 14,2018 - 10:01 by Z_CLU

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రాజ్ తరుణ్ – చిత్ర శుక్లా జంటగా తెరకెక్కిన ‘రంగుల రాట్నం’ ఈరోజే గ్రాండ్ గా రిలీజయింది. యూత్ ఫుల్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ , ట్రైలర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని ధీమాగా ఉంది యూనిట్.

ఓవర్సీస్ లో ఇప్పటికే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఈరోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాగా సందడి చేయబోతుంది. ఉయ్యాల- జంపాల తర్వాత రాజ్ తరుణ్ హీరోగా నాగార్జున నిర్మించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. అక్కినేని నాగార్జున నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించాడు.