మరికొన్ని గంటల్లో రంగులరాట్నం ట్రయిలర్ రిలీజ్

Wednesday,January 03,2018 - 11:32 by Z_CLU

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సినిమా రంగులరాట్నం. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు రంగులరాట్నం ట్రయిలర్ ను రిలీజ్ చేస్తారు.

శ్రీరంజిని డైరక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది రంగులరాట్నం సినిమా. చిత్రా శుక్లా ఈ సినిమాతో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయమౌతోంది. సితార, ప్రియదర్శి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

అన్నపూర్ణ స్టుడియోస్ నిర్మించిన ఉయ్యాల జంపాల చిత్రంతోనే హీరోగా పరిచయమయ్యాడు రాజ్ తరుణ్. మళ్లీ ఇన్నేళ్లకు ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై రంగులరాట్నం సినిమా చేశాడు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.