'రంగులరాట్నం' హీరోయిన్ ‘చిత్రా శుక్ల’ ఇంటర్వ్యూ

Tuesday,January 09,2018 - 03:40 by Z_CLU

రాజ్ తరుణ్, చిత్రా శుక్ల జంటగా నటించిన రంగులరాట్నం సంక్రాతికి రిలీజవుతుంది. ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చిత్రా శుక్లా ఈ సినిమా గురించి చాలా ఎగ్జైటెడ్ గా మాట్లాడింది. అవి మీకోసం…

చాలా హ్యాప్పీ….

రంగులరాట్నం నాకు రెండో సినిమా… సినిమాకి అన్ని వైపుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాప్పీగా ఉంది. అన్నపూర్ణ బ్యానర్ లో  డైరెక్టర్ శ్రీ రంజని గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.

ఒక్కోసారి ఒక్కోలా…  

శ్రీ రంజని గారు ఒక్కోసారి టీచర్ లా ఉంటారు. ఒక్కోసారి ఫ్రెండ్లీగా ఉంటారు. సీన్ ఎక్స్ ప్లేన్ చేసేటప్పుడు తను యాక్ట్ చేసి చూపిస్తారు కాబట్టి, అసలే ఇబ్బంది ఉండదు. ఓవరాల్ గా షీ ఈజ్ ది బెస్ట్.

అదే నా క్యారెక్టర్…

ఈ సినిమాలో నేను చాలా రెస్పాన్సిబుల్ అమ్మాయిలా కనిపిస్తాను. నేను హీరోతో లవ్ లో ఎలా పడతాను, ఆ తరవాత జరిగే సిచ్యువేషన్స్, సినిమాలో నా రోల్ చాలా న్యాచురల్ గా ఉంటుంది.

 

అదే రాజ్ తరుణ్ తో అడ్వంటేజ్…  

మన కో స్టార్ మన ఫ్రెండ్ అయితే చాలా బావుటుంది. మా ఇద్దరి విషయంలో అదే జరిగింది. ఇద్దరం చాలా టాకెటివ్. మాట్లాడుతూనే ఉంటాం. డైలాగ్స్ విషయంలో కూడా తను నాకు హిందీలో ఎక్స్ ప్లేన్ చేసేవాడు. రాజ్ తరుణ్ హిందీలో కూడా చాలా బాగా మాట్లాడతాడు.

ఫ్యామిలీ మొత్తం ఆయన ఫ్యాన్సే…

 మా ఫ్యామిలీ లో అందరూ నాగార్జున గారి ఫ్యాన్సే. అందరం కలిసి ఆయన సినిమాలు చూస్తుంటాం. అలాంటిది అన్నపూర్ణ బ్యానర్ లో చాన్స్ అనగానే చాలా హ్యాప్పీగా అనిపించింది. ఆ తరవాత స్క్రిప్ట్ విన్నాక, అదృష్టంలా ఫీలయ్యా..

చాలా థాంక్స్…

ఈ సినిమా విషయంలో సుప్రియ గారికి, నాగార్జున గారికి , డైరెక్టర్ శ్రీ రంజని గారికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్….

చాలెంజింగ్ రోల్స్…

సినిమాలో నాకంటూ వ్యాల్యూబుల్ స్పేస్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ చేద్దామనుకుంటున్నా, న్యాచురల్ గా పక్కింటి అమ్మాయిలా కనబడే క్యారెక్టర్స్, చాలెంజింగ్ రోల్స్ చేద్దామనుకుంటున్నా…