'రంగులరాట్నం' డైరెక్టర్ శ్రీరంజని ఇంటర్వ్యూ
Tuesday,January 09,2018 - 03:06 by Z_CLU
శ్రీరంజని డైరెక్షన్ లో తెరకెక్కిన రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. స్వీట్ & క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా, సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ శ్రీరంజని సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు తన ఎక్స్ పీరియన్సెస్ షేర్ చేసుకుంది. ఆ
నిజంగా నా అదృష్టం…
రంగులరాట్నం నా డెబ్యూ మూవీ. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి బ్యానర్ తో లాంచ్ అవ్వడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.
సినిమాలో అదే కొత్తదనం.
సెల్వ రాఘవన్ దగ్గర 9 ఏళ్ళు పని చేశాను. 7/G బృందావన కాలనీ సినిమా నుండి ఆయన టీమ్ లో ఉన్నాను. ఇక ‘రంగులరాట్నం’ సినిమా గురించి చెప్పాలంటే ఇదొక స్వీట్ & క్యూట్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో ఉండే కాన్ఫ్లిక్ట్ చాలా కొత్తగా ఉంటుంది.

తెలుగు నాకు కొత్తేం కాదు…
తెలుగులో సినిమా అనగానే చాలెంజింగ్ అనిపించింది. కానీ నేను సెల్వ రాఘవన్ తో చేసినప్పుడు చాలా సినిమాలు హైదరాబాద్ లో చేశాం. సెల్వ రాఘవన్ గారికి RFC అంటే చాలా ఇష్టం. అలా నాకు తెలుగు వచ్చు కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.
అలా జరిగింది…
స్క్రిప్ట్ చాలా చోట్ల చెప్పాను. అందరికీ స్క్రిప్ట్ నచ్చుతుంది కానీ, టైమ్ అడుగుతున్నారు. అలా ఒకసారి సినిమాటోగ్రాఫర్ ‘మది’ గారికి స్క్రిప్ట్ చెప్పాను, ఆయన ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ గారికి చెప్పమని సూచించారు. ఆ తరవాత ఆయన సుప్రియ గారికి రిఫర్ చేయడం, ఆవిడ స్క్రిప్ట్ విన్నాక నాగార్జున గారికి చెప్పడంతో ఆయనకు స్క్రిప్ట్ నచ్చి, సినిమా సెట్స్ పైకి వచ్చింది.
హిడెన్ మెసేజెస్
డ్రంక్ & డ్రైవ్ పోస్టర్ చాలా వైరల్ అయింది. నిజానికి ఈ పోస్టర్ ఒక మాంటేజ్ సాంగ్ లోంచి తీసుకున్నాం. ఈ పోస్టర్ లో నిజానికి అమ్మాయి డ్రింక్ చేయలేదు. ఇలా చెప్పాలంటే సినిమాలో అక్కడక్కడా చాలా హిడెన్ మెసేజెస్ ఉంటాయి.
రాజ్ తరుణ్ ని నేను అడగలేదు…
నిజానికి ఈ సినిమాలో పర్టికులర్ హీరో కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. సుప్రియ గారు రాజ్ తరుణ్ గురించి చెప్పినప్పుడు తన సినిమాలన్నీ వరసగా చూశాను. పర్ఫెక్ట్ అనిపించింది. అలా రాజ్ తరుణ్ ఫిక్సయ్యాడు.
మరి హీరోయిన్
హీరోయిన్ విషయంలో అయితే ఫ్రెష్ ఫేస్ అని అనుకున్నాం. ఇప్పటివరకు ఎటువంటి ఇమేజ్ లేని అమ్మాయయితే బావుంటుందని చిత్రని ఫిక్సయ్యాం.
అబ్బాయిలకే తెలీదు
నాకు అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ రాయడం పెద్దగా కష్టమేం అనిపించలేదు. నిజం చెప్పాలంటే అందరు అమ్మాయిలకు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది. అబ్బాయిలకే అమ్మాయిల గురించి ఏమీ తెలీదు. అందుకే నాకు ఈజీ అనిపించింది.
సెల్వ గారే చెప్పారు
నాకు సినిమా అంటే చాలా ఇష్టం. నాకు సింగింగ్ వచ్చు, డ్యాన్స్ వచ్చు… ఇలా ఆలోచిస్తుంటే సినిమాలో నేనేం చేయగలను అని ఆలోచిస్తున్నప్పుడు డైరెక్టర్ అయితే ఏదైనా అవ్వచ్చు అన్నారు సెల్వ. అది నిజం. అందుకే డైరెక్టర్ నయ్యా.
నాగార్జున గారు సినిమా చూశారా…?
నాగార్జున గారు సినిమా ఇంకా చూడలేదు కానీ, స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడే ఆయన చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యారు. ఆయన కచ్చితంగా సినిమా గా చూస్తారు.
సెల్వ రాఘవన్ స్ట్రాటజీ…
సెల్వ రాఘవన్ దగ్గర ఏదైతే నేర్చుకున్నానో ఈ సినిమాలో అది కనిపిస్తుంది. ఆయన బేసిగ్గా ఇమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఎక్స్ పర్ట్. ఈ సినిమాలో కూడా మీకు ఆ తరహా ఇమోషన్స్ ఉంటాయి.
సంక్రాంతి రోజు…
మార్నింగ్ షో అజ్ఞాతవాసి, మ్యాట్నీ జై సింహా, ఈవినింగ్ షో రంగులరాట్నం చూస్తాను.
రాజ్ తరుణ్ లుక్స్ డిఫెరెంట్
సుప్రియ గారు రాజ్ తరుణ్ ని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేయాలి అన్నప్పుడు కంప్లీట్ గా ఒక రోజంతా ఆ యాంగిల్ లో చర్చించాం. ఫ్రంట్ హెయిర్ కట్ చేశాము. బిగినింగ్ లో రాజ్ తరుణ్ ఒప్పుకోలేదు. ఈ సినిమాలో మీ నుదురు కనిపించాలి అని కన్విన్స్ చేసి హెయిర్ స్టైల్ మార్చేశాం.