సంక్రాంతి సీజన్ లో పర్ఫెక్ట్ మూవీగా నిలిచిన ‘రంగులరాట్నం’

Wednesday,January 17,2018 - 01:10 by Z_CLU

రాజ్ తరుణ్, చిత్ర శుక్ల జంటగా నటించిన ‘రంగుల రాట్నం’ పాజిటివ్ టాక్ తో ఇంప్రెస్ చేస్తుంది. జనవరి 14 న రిలీజైన ఈ లవ్ & ఇమోషనల్ ఎంటర్ టైనర్ ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా శ్రీ రంజని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలోని కాంఫ్లిక్ట్, ఫీమేల్ ఆడియెన్స్ ని ఫుల్ గా ఇంప్రెస్ చేసేసింది.

తల్లి కొడుకుల సెంటిమెంట్ తో పాటు  పెళ్ళి చేసుకోబోయే యంగ్ కపుల్ మధ్య ఉండే   రిలేషన్ షిప్ ని సెన్సిటివ్ గా ప్రెజెంట్ చేసిన శ్రీరంజని ఈ సినిమాతో, టాలీవుడ్ లో తన మార్క్ ని రిజిస్టర్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. సినిమాలో హైలెట్ గా నిలిచే ప్రతి ఇమోషన్ సీన్ కి శ్రీచరణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది.

సంక్రాంతి సీజన్ లో బడా సినిమాలతో పాటు కాన్ఫిడెంట్ గా బరిలో దిగిన ఈ సినిమా, పండగ సీజన్ లో డీసెంట్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అన్నపూర్ణ మేకింగ్ వాల్యూస్, రాజ్ తరుణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రియదర్శి కాంబినేషన్ లో పండిన కామెడీ… సినిమాని సక్సెస్ ట్రాక్ పై నిలబెట్టాయి.