యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్న ‘రంగుల రాట్నం’

Monday,January 08,2018 - 11:24 by Z_CLU

రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ సంక్రాంతి కానుకగా రిలీజవుతుంది. ప్రస్తుతం సెన్సార్ ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, త్వరలో ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉంది. ఇదిలా ఉంటే అల్టిమేట్ యూత్ ఫుల్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ యూ ట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది.

యూత్ ఫుల్ లవ్ & ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, సోషల్ మీడియాలో యూత్ ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అవుతుంది. చిత్రా శుక్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సితార, ప్రియదర్శి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. శ్రీ చరణ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియో ని త్వరలో రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ సినిమాని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించాడు. శ్రీ రంజని డైరెక్టర్.