RangDe Trailer - రికార్డ్ సృష్టించింది

Wednesday,March 24,2021 - 03:37 by Z_CLU

రంగ్ దే మూవీ రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ 10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ట్రయిలర్ ఎంత హిట్టయిందో చెప్పడానికి, సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పడానికి ఈ నంబర్ పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది.

నితిన్-కీర్తిసురేష్ ఫ్రెష్ కాంబినేషన్ కు తోడు.. సాంగ్స్ సూపర్ హిట్టవ్వడం, కామెడీ ఎలిమెంట్స్ ఉండడంతో సహజంగానే రంగ్ దే సినిమా అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. దీనికితోడు సినిమాకు భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు.

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది రంగ్ దే. వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు.