Rang De... మరో షెడ్యుల్ పూర్తి

Wednesday,October 07,2020 - 12:56 by Z_CLU

Nithiin, Keerthy Suresh జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘RangDe’కి సంబంధించి మరో షెడ్యుల్ పూర్తి చేసింది యూనిట్. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ ను ఇటివలే ఫినిష్ చేశారు. హైదరాబాద్ లో పలు లోకేషన్స్ లో నితిన్, కీర్తి మిగతా నటీనటులపై కొన్ని సన్నివేశాలు షూట్ చేసిన యూనిట్ షెడ్యుల్ కి ప్యాకప్ చెప్పారు. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేశాడు. సేఫ్ గా మరో షెడ్యుల్ పూర్తి చేశాం అంటూ ప్రకటించాడు.

Sithara Entertainments బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.