RandGe - రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,January 04,2021 - 02:36 by Z_CLU

యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ఫ్రెష్ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ’ సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది

న్యూ ఇయర్ కు వెల్ కం చెబుతూ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. దీనికి మ్యూజిక్ తో కూడిన ఓ చిన్న వీడియో రెడీ చేశారు. ఇందులో నితిన్, కీర్తిసురేష్ ల మధ్య కెమిస్ట్రీ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. 2021 మార్చి 26 న ధియేటర్లలోకి వస్తోంది రంగ్ దే.

‘ప్రేమ’తో నిండిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రంగ్ దే’. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

హీరోహీరోయిన్లు – నితిన్, కీర్తి సురేష్
నటీనటులు – సీనియర్ నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు
డి.ఓ.పి: పి.సి.శ్రీరామ్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కూర్పు: నవీన్ నూలి
కళ: అవినాష్ కొల్లా
అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశీ
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి