'రంగస్థలం' అప్ డేట్స్

Saturday,June 17,2017 - 03:08 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో 1985 లో జరిగే కథతో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘రంగస్థలం’. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతంలో గోదారి తీరాన్న రామ్ చరణ్ సమంత లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ నెలాఖరు వరకూ జరగనున్న ఈ షెడ్యూల్ లో  జగపతి బాబు, ఆది పినిశెట్టి, రావు రమేష్, రోహిత్ శెట్టి వంటి నటుల పై  కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు యూనిట్. సినిమాలో కొన్ని రెయిన్ ఎఫెక్ట్స్ సీన్స్ కూడా ఉండడంతో  ఈ రెయినీ సీజన్ ను వాడుకుంటున్నాడట సుకుమార్.  వర్షాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా షూట్ లో పాల్గొంటుంటూ తన డెడికేషన్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాడట చెర్రీ.. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ కోసం చరణ్ వర్షంలో తడుస్తున్న పిక్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. పీరియాడిక్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవి సంగీతం అందిస్తున్నాడు.