ఫిబ్రవరి 13న రంగస్థలం సాంగ్ టీజర్

Monday,January 29,2018 - 07:01 by Z_CLU

రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రంగస్థలం ఇప్పుడిప్పుడే ప్రచారాన్ని పెంచుతోంది. మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసింది యూనిట్. దానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన 2 రోజుల వరకు నంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచింది. ఆ ఉత్సాహంతో త్వరలోనే సమంత ఫస్ట్ లుక్ ను, సాంగ్ టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నారు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఫిబ్రవరి 13న రంగస్థలం సాంగ్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. సాంగ్ టీజర్ విడుదలైన వెంటనే మినిమం గ్యాప్ లో దశలవారీగా సాంగ్స్ ను రిలీజ్ చేసి, జ్యూక్ బాక్స్ ను తీసుకొస్తారు. ఆ తర్వాత ట్రయిలర్ రిలీజ్ ఉంటుంది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి 30న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.