డిఫరెంట్ సాంగ్ మేకింగ్ లో 'రంగస్థలం'

Wednesday,October 25,2017 - 04:55 by Z_CLU

రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘రంగస్థలం’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్న యూనిట్.. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ విలేజ్ సెట్ లోకి షిఫ్ట్ అయింది. ఈ సెట్ లో కేవలం రామ్ చరణ్ పై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. డిఫరెంట్ గెటప్స్ వేసుకున్న చాలామంది జూనియర్ ఆర్టిస్టులు సెట్ లో సందడిగా కనిపిస్తున్నారు. ఆ స్టిల్ ను రామ్ చరణ్ షేర్ చేశాడు కూడా…

1985 నాటి కాలానికి చెందిన కథతో తెరకెక్కుతోంది రంగస్థలం. అప్పటి కాలాన్ని ప్రతిబింబించేలా విలేజ్ సెట్ రూపొందించారు. ఆ సెట్ పిక్స్ ను ఇప్పటికే షేర్ చేసిన రామ్ చరణ్.. తాజాగా సాంగ్ షూటింగ్ స్టిల్ కూడా రిలీజ్ చేశాడు. ఒకప్పుడు పండగలకు వేషాలు ఎలా వేసేవారో.. ఆ వేషాలన్నీ ఈ సాంగ్ లో కనిపిస్తాయి. నిజానికి ఇప్పటికీ చాలా పల్లెల్లో పండగలకు ఇలాంటి వేషాలు మనం చూస్తూనే ఉంటాం.

మొత్తానికి కంప్లీట్ డిఫరెంట్ గా రంగస్థలం సినిమా ఉండబోతోనే విషయం అర్థమైపోయింది. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత  దర్శకుడు.