'రంగస్థలం' షూటింగ్ అప్ డేట్స్

Wednesday,September 27,2017 - 10:09 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో మచ్ ఎవైటింగ్ మూవీ గా తెరకెక్కుతున్న విల్లేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రంగస్థలం’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 1985 బాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా  ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన   భారీ  విల్లేజ్ సెట్ లో రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ ఫైట్ కూడా చిత్రీకరిస్తుంది యూనిట్. నవంబర్ వరకూ జరగనున్న ఈ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పి ప్రమోషన్ పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు మేకర్స్ .

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, ప్రకాష్ రాజ్, ఆది పిన్ని శెట్టి కీ రోల్స్ లో నటిస్తున్నారు. ప్రెజెంట్ ఫాస్ట్ ఫేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు  సంబంధించి  విజయ దశమి కానుకగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు .