రంగస్థలం ఫస్ట్ లుక్: చెర్రీ చించేశాడు

Saturday,December 09,2017 - 09:34 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రంగస్థలం ఫస్ట్ లుక్ రిలీజైంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే అదిరిపోయే స్టిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

గళ్ల చొక్కా, గళ్ల లుంగీ కట్టుకున్న చరణ్.. ఆనందంతో డాన్స్ చేస్తున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారు. ఈ స్టిల్ ఇనిస్టెంట్ గా హిట్ అయి, అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

ఇక టైటిల్ ను కూడా స్టోరీ థీమ్ కు తగ్గట్టు డిజైన్ చేయడం బాగుంది. 80ల్లో సినిమా టైటిల్స్ ఎలా ఉండేవో.. అదే కాన్సెప్ట్ ను రంగస్థలం కోసం ఎంచుకున్నారు.  ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ రోజునే విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. మార్చి 30న రంగస్థలం థియేటర్లలోకి రానుంది.

డిఫరెంట్ స్టోరీలైన్ తో వస్తున్న రంగస్థలం సినిమాలో చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబద్ బూత్ బంగ్లాలో జరుగుతోంది.