దసరా కి రామ్ చరణ్ సప్రయిజ్ ?

Sunday,September 24,2017 - 01:40 by Z_CLU

మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులకు దసరా సందర్భంగా ఓ సప్రయిజ్ ప్లాన్ చేస్తున్నాడట… ప్రస్తుతం సుకుమార్ తో ‘రంగస్థలం’ అనే సినిమా చేస్తున్న చరణ్ త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో మెగా ఫాన్స్ ను ఖుషి చేయబోతున్నాడట.  ఇప్పటికే ప్రి ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరినీ ఆకట్టుకుని సినిమా పై అంచనాలు పెంచడంతో విజయదశమి  రోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసి సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయాలనీ చూస్తున్నారట మేకర్స్.

1985 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మొన్నటి వరకూ గోదావరి జిల్లాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ , సమంత , జగపతిబాబు, ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి కూడా పాల్గొంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి మ్యూజిక్ అందిస్తున్నాడు.