Ranga Ranga Vaibhavamga - టీజర్ తో మెప్పించిన జంట

Tuesday,January 25,2022 - 03:35 by Z_CLU

Ranga Ranga Vaibhavamga Title Teaser Released

మెగా హీరో వైష్ణవ్ తేజ్ , కేతిక శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #PVT3 సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసి టీజర్ రిలీజ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బేనర్ పై బాపినీడు సమర్పణలో BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ రివీల్ చేస్తూ హీరో -హీరోయిన్ మధ్య వచ్చే ఓ రొమాంటిక్ బిట్ ను టీజర్ గా రిలీజ్ చేసి సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేలా హింట్ ఇచ్చారు.

వైష్ణవ్ తేజ్ , కేతిక శర్మ మధ్య ఓ ముద్దు సీన్ తో టైటిల్ టీజర్ కట్ చేశారు. ” నీకు బటర్ ఫ్లై కిస్ అంటే తెలుసా ? అని హీరోయిన్ అడగ్గానే వైష్ణవ్ తేజ్ తెలియదు అనడంతో ఇద్దరు కలిసి ఆ కిస్ ఎక్స్ పీరియన్స్ చేసే విజువల్స్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాను యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని అర్థమవుతుంది. అలాగే సినిమాలో హీరో -హీరోయిన్ మధ్య ఉండే లవ్ ట్రాక్ యూత్ ని బాగా ఇంప్రెస్ చేయనుందని తెలియజేసేలా ఉంది.

సాధారణంగా ఏదైనా పెద్ద ఈవెంట్ గురించి మాట్లాడినప్పుడు వాడే ‘రంగ రంగ వైభవంగా’ అనే పదాన్ని సినిమాకు టైటిల్ గా పెట్టారు. బహుశా వైభవంగా జరిగే హీరో హీరోయిన్ పెళ్లి కి ముందు నడిచే ప్రేమ కథ కావొచ్చు. అలాగే సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పించే అంశాలు ఉంటాయని తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ కి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ మరోసారి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. టీజర్ లో కూడా దేవి ఫ్రెష్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.