RangDe - మూవీ ఎట్రాక్షన్స్

Thursday,March 25,2021 - 10:00 by Z_CLU

అర్జున్ -అనులుగా ‘రంగ్ దే’ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు నితిన్ ,కీర్తి సురేష్. క్యూట్ లవ్ స్టోరీతో వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా హోలీ సందర్భంగా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది.  ఈ సందర్భంగా సినిమాలోని టాప్ ఎట్రాక్షన్ ఏంటో చూద్దాం.

rangde-special-attractions-zeecinemalu

హీరో నితిన్ ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. లవర్ బాయ్ లుక్ తో ఫన్నీ క్యారెక్టర్ తో  సినిమాకు హైలైట్ గా నిల్వబోతున్నాడు. ఈ విషయం టీజర్ ,  ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అను అనే అమ్మాయి వల్ల ఇబ్బంది పడే కుర్రాడిగా అర్జున్ పాత్రతో సరికొత్తగా ఎంటర్టైన్ చేయనున్నాడు యూత్ స్టార్.

మహానటితో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన హీరోయిన్ కీర్తి సురేష్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అర్జున్ ని నిత్యం ఇబ్బంది పెడుతూ అతనికి టార్చర్ చూపించే అను పాత్రలో కీర్తి సురేష్ క్యారెక్టర్ సినిమాకు ప్లస్ అవ్వనుంది. ముఖ్యంగా నితిన్- కీర్తి మధ్య కెమిస్ట్రీ  సినిమాకు అడ్వాంటేజ్ అవ్వనుందని ఇన్సైడ్ టాక్.

రిలీజ్ కి ముందే సాంగ్స్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేసి మ్యూజికల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు దేవి శ్రీ ప్రసాద్.  స్వీట్ లవ్ స్టోరీకి అంతే స్వీట్ సాంగ్స్ కంపోజ్ చేసి ఆల్బంతో మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాడు DSP. ‘రంగ్ దే’ కి సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా బెస్ట్ సపోర్ట్ అందించాడు దేవి.

ఈ మధ్య కాలంలో సిద్ శ్రీరామ్ పాడిన పాటలన్నీ మిలియన్స్ సాక్షిగా సూపర్ హిట్ అవుతున్నాయి. అలాగే సిద్ పాడిన సినిమాలు దాదాపు విజయాలే. ఆ లెక్కన చూస్తే సిద్ శ్రీరాం కూడా సినిమాకు ఓ ఎట్రాక్షన్ అనుకోవచ్చు. ‘రంగ్ దే’ కోసం సిద్ పాడిన ‘నా కనులు ఎపుడూ’  లిరికల్ సాంగ్ ఇప్పటికే మిలియన్స్ తో యూ ట్యూబ్ లో దూసుకెళ్తుంది. సినిమాలో ఈ సాంగ్ విజువల్ గా చూసేందుకు ఆడియన్స్ క్యూరియాసిటీతో ఉన్నారు.

సినిమాలో లవ్ , ఎమోషన్ తో పాటు మంచి వినోదం కూడా ఉందని ట్రైలర్ లో హింట్ ఇచ్చాడు వెంకీ అట్లూరి. డా. నరేష్ , వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ , సుహాస్ , అభినవ్ గోమటం ఇంకొంత మంది కమెడియన్స్ తమ క్యారెక్టర్స్ తో నవ్వించనున్నారు. ముఖ్యంగా వెన్నెల కిశోర్ ట్రాక్ సినిమాకు హైలైట్ కానుందని టాక్.

పీ.సీ.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఇంకో ఎట్రాక్షన్. తనదైన కెమెరా వర్క్ తో బ్యూటిఫుల్ విజువల్స్ అందించి ‘రంగ్ దే’ ని మరింత  కలర్ ఫుల్ గా తీర్చిదిద్దాడు PC.  ఇప్పటికే టీజర్ , ట్రైలర్స్ లో తన వర్క్ తో ఎట్రాక్ట్ చేసిన పిసీ శ్రీరామ్ సినిమాకి విజువల్ గా మంచి సపోర్ట్ అందించాడు.

వెంకీ అట్లూరి రాసుకున్న స్టోరీ -స్క్రీన్ ప్లే సినిమాకు మరో ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. చిన్నప్పటి నుండి ప్రతీ విషయంలో తనని డామినేట్ చేసే పక్కింటి అమ్మాయి అనుతో పెళ్ళయ్యాక అర్జున్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు..? అనే సరదా స్టోరీకి తనదైన ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే రాసుకొని ఎంటర్టైన్ చేయబోతున్నాడు వెంకీ. బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీస్ హ్యాండిల్ చేసిన వెంకీ ఆ ఎక్స్ పీరియన్స్ తో ఈ లవ్ స్టోరీని మరింత క్యూట్ గా తెరకెక్కించాడని ఇన్సైడ్ టాక్.

కొన్ని బేనర్ నుండి వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో ఓ  నమ్మకం ఉంటుంది. అలాంటి బేనర్ లో సితార ఎంటర్టైన్ మెంట్ ఒకటి. ఈ బేనర్ నుండి వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ సక్సెస్ సాధించినవే. పైగా ‘భీష్మ’ తర్వాత ఈ బేనర్ నుండి వస్తున్న సినిమా కావడంతో ‘రంగ్ దే’ మంచి అంచనాలున్నాయి.

మరి ఇన్ని స్పెషల్ ఎట్రాక్షన్స్ తో మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వడం ఖాయమనిపిస్తుంది.