Rang De - ఫస్ట్ డే కలెక్షన్

Saturday,March 27,2021 - 11:41 by Z_CLU

టాలీవుడ్ బాక్సాఫీస్ పై కామెడీ ఫార్ములా మరోసారి వర్కవుట్ అయింది. చూస్తుంటే ఇప్పుడు కామెడీ ట్రెండ్ నడిచేలా ఉంది. ఇప్పటికే జాతిరత్నాలు సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అవ్వగా.. ఇప్పుడు రంగ్ దే మూవీ కూడా అదే బాటలో నడుస్తోంది. ఫస్ట్ డే ఈ సినిమాకు కలెక్షన్లు క్యూ కట్టాయి.

నితిన్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన రంగ్ దే సినిమాకు మొదటి రోజు ఏపీ, నైజాంలో ఏకంగా 4 కోట్ల 65 లక్షల రూపాయల షేర్ వచ్చింది. భీష్మ తర్వాత నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇదే.

నిజానికి ఈ సినిమాకు ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చి ఉండేవి. ఏపీలో భారత్ బంద్ గట్టిగ నడిచింది. దీనికితోడు ప్రేక్షకులకు మరోసారి కరోనా భయం పట్టుకుంది. లేదంటే వసూళ్లు మరో కోటి రూపాయలు ఈజీగా పెరిగి ఉండేవి.

లాంగ్ వీకెండ్ భీష్మ సినిమాకు అదనపు అడ్వాంటేజ్ కాబోతోంది. హోలీ కూడా కలిసి రావడంతో ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే కలెక్షన్
నైజాం – రూ. 1.54 కోట్లు
సీడెడ్ – రూ. 0.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.56 కోట్లు
ఈస్ట్ – రూ. 0.52 కోట్లు
వెస్ట్ – రూ. 0.31 కోట్లు
గుంటూరు – రూ. 0.67 కోట్లు
నెల్లూరు – రూ. 0.24 కోట్లు
కృష్ణా – రూ. 0.21 కోట్లు