Rang De - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,March 29,2021 - 11:23 by Z_CLU

నితిన్ హీరోగా నటించిన రంగ్ దే సినిమా రివ్యూస్ పరంగా ఆల్రెడీ సూపర్ హిట్టయింది. ఇప్పుడు రెవెన్యూ పరంగా కూడా ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు భారీగా వసూళ్లు వచ్చాయి.

రంగ్ దేకు మొదటి 3 రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) ఏకంగా 10 కోట్ల 35 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ షేర్ వాల్యూ 12.47 కోట్ల రూపాయలు. ఈ వసూళ్లతో సినిమా సూపర్ హిట్టనే విషయం తేలిపోయింది.

రంగ్ దే వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఎందుకంటే వీకెండ్ కు తోడు ఈ మూవీకి ఇప్పుడు హోలీ కలిసొచ్చింది. శని-ఆదివారాలతో సమానంగా ఈరోజు కూడా రంగ్ దేకు వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ షేర్స్
నైజాం – రూ. 3.79 కోట్లు
సీడెడ్ – రూ. 1.66 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.30 కోట్లు
ఈస్ట్ – రూ. 0.85 కోట్లు
వెస్ట్ – రూ. 0.57 కోట్లు
గుంటూరు – రూ. 1.09 కోట్లు
కృష్ణా – రూ. 0.65 కోట్లు
నెల్లూరు – రూ. 0.44 కోట్లు