హాట్ టాపిక్ గా మారిన రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్

Friday,April 14,2017 - 12:45 by Z_CLU

బాలీవుడ్ లో బయోపిక్ సీజన్ నడుస్తుంది. అందులో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సంజయ్ దత్ బయోపిక్ పై రోజు రోజుకి ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి.  రాజ్ కుమార్ హిరాని డైరెక్షన్ లో తెరకెక్కుతున్నఈ సినిమాని  విదు వినోద్ చోప్రా నిర్మిస్తున్నాడు.

కాస్టింగ్ దగ్గరి నుండి ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా స్పెషల్ కేర్ తీసుకున్న సినిమా యూనిట్, రణబీర్ కపూర్ లుక్ విషయంలోనూ ఏ మాత్రం చాన్స్ తీసుకోలేదు. సంజయ్ దత్ అమ్మ ప్రముఖ నటి నర్గీస్ క్యారెక్టర్ ని, మనీషా కోయిరాలా పోషించడం కూడా ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తే, రీసెంట్ గా బయటికి వచ్చిన రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ బాలీవుడ్ లో చిన్న సైజు సెన్సేషన్ నే క్రియేట్ చేసింది.

రీసెంట్ గా లోక్ మాధ్ ఫోర్త్ ఎడిషన్ అవార్డ్స్ 2017 కార్యక్రమంలో పాల్గొన్న రణబీర్ కపూర్, తన డిఫెరెంట్ లుక్ తో అందరినీ షాక్ కి గురి చేశాడు. తన నెక్స్ట్ మూవీ సంజయ్ దత్ బయోపిక్ లో తన లుక్ ఇదే అని చెప్పుకున్న రణబీర్ కపూర్ ఈ సినిమా ఆల్ రెడీ 60% కంప్లీట్ అయిపోయిందని, వీలైనంత ఫాస్ట్ గా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్నామని చెప్పుకున్నాడు.