Rana - సంక్రాంతి లిస్టులో చేరిన హీరో

Wednesday,October 21,2020 - 01:09 by Z_CLU

వచ్చే ఏడాది Sankranthi కి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొననుంది. అవును ఇప్పటికే నితిన్ ‘Rang De’, బెల్లంకొండ ‘Alludu Adurs’ , అఖిల్ హీరోగా నటిస్తున్న Most Eligible Bachelor సినిమాలు సంక్రాంతి రిలీజ్ అఫీషియల్ అనౌన్స్ చేసారు. ఇంకా కొన్ని సినిమాలు కూడా సంక్రాంతి పోటీలో నిలవనున్నాయని సమాచారం. తాజాగా ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ లిస్టులో మరో సినిమా చేరింది.

Rana Aranya సినిమా కూడా సంక్రాంతికే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. దాదాపు ఏడాది నుండి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ బైలింగ్వెల్ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మరి ఈ పోటీలో రానా సినిమాకి కొనసాగింపుగా ఇంకేం సినిమాలు వస్తాయో చూడాలి.

ఈరోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పాన్-ఇండియా సినిమాగా తెరకెక్కింది అరణ్య. ప్రభు సాల్మాన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రానాత ోపాటు విష్ణువిశాల్, శ్రియ, పులకిత్ సామ్రాట్ కీలక పాత్రలు పోషించారు.