పవర్ ఫుల్ శర్వా: రణరంగం ట్రయిలర్ రివ్యూ

Monday,August 05,2019 - 11:53 by Z_CLU

రణరంగం సినిమాలో శర్వానంద్ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడనే విషయం పాతదే. ఇక ఈ సినిమాలో శర్వానంద్ మాఫియా లీడర్ గా ఎదిగిన క్రమాన్ని కూడా చూపించబోతున్నారనే విషయం కూడా పాతదే. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ లో రణరంగం ట్రయిలర్ కొత్తగా అనిపించదు. కానీ ఈ రెండు పాత విషయాల్నే సరికొత్త విజువల్స్ తో ట్రయిలర్ లో ప్రజెంట్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది. అదే రణరంగం ట్రయిలర్ ను సూపర్ హిట్ చేసింది.

20 ఏళ్ల ఓ కామన్ మేన్, లవర్ బాయ్ షేడ్స్ నుంచి 40 ఏళ్ల మాజీ మాఫియా డాన్ గా ఎలా మారాడనే ట్రాన్స్ ఫర్మేషన్ ట్రయిలర్ లో స్పష్టంగా కనిపించింది. వయసుమళ్లిన పాత్ర పోషించడం శర్వాకు కొత్తకాదు. స్టయిలిష్ గా కనిపించడం కూడా కొత్త కాదు. కాబట్టి 40 ఏళ్ల పవర్ ఫుల్ డాన్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. ఈ ట్రయిలర్ లాంఛ్ కార్యక్రమంలో త్రివిక్రమ్ చెప్పినట్టు.. 40 ఏళ్ల గెటప్ లో శర్వానంద్ మనల్ని ఇబ్బందిపెట్టడు. అతికినట్టు సరిపోయాడు.

శర్వానంద్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కల్యాణి, ప్రజెంట్ హీరోయిన్ గా కాజల్ నటించారు. సుధీర్ వర్మ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించాడు. ట్రయిలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలోకి వస్తోంది.