చిరు సినిమాలో రానా..?

Sunday,May 14,2017 - 02:10 by Z_CLU

లేటెస్ట్ గా ‘ఖైదీ నంబర్ 150 ‘ సినిమాతో రి ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్వతంత్ర సమరయోధుడు ‘ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి’ కథ ను కూడా లాక్ చేసుకున్న చిరు ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు…

సురేందర్ రెడ్డి దర్శకత్వం లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో ఇప్పటికే విక్టరీ వెంకటేష్ తో పాటు శ్రీకాంత్ కూడా ఓ రోల్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తుండగా లేటెస్ట్ గా ఈ సినిమాలో మరో హీరో పేరు తెరపైకి వచ్చింది.. ‘బాహుబలి’ తో ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు అందుకున్న రానా దగ్గుబాటి ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది… తాజాగా ఈ సినిమాలోని విలన్ క్యారెక్టర్ గురించి యూనిట్ రానా కి వివరించారని దీని పై రానా ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే….