రానా, వెంకటేష్ కాంబినేషన్ లో పొలిటికల్ డ్రామా

Thursday,December 28,2017 - 01:05 by Z_CLU

సినిమాల్లో ఒకే ఫ్రేమ్ లో కనిపించకపోయినా, ఓ వెబ్ సిరీస్ లో కలిసి నటించేందుకు అంగీకరించారు రానా, వెంకటేష్.
అబ్బాయ్ రానా, బాబాయ్ వెంకటేష్ కలిసి ఓ పొలిటికల్ కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది.

ఇందులో రానా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. IPS ఆఫీసర్ కార్తికేయన్ పాత్రలో వెంకటేష్ కనిపిస్తాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కు LTTE అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. సిరీస్ కు సంబంధించి చాలా సన్నివేశాల్ని సెట్ లో కాకుండా.. రియల్ లైఫ్ లొకేషన్స్ లో తెరకెక్కించనున్నారు.

ప్రధానంగా రాజీవ్ గాంధీపై ఫోకస్ చేస్తూ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ ను తీయబోతున్నారు. ఆ తర్వాత సీజన్స్ లో LTTE చీఫ్ ప్రభాకరన్ పై ఫోకస్ చేస్తారు. వెబ్ సిరీస్ కు సంబంధించి రీసెర్చ్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైంది. ఈ సిరీస్ లో రానా ఏ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.