సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి రానా

Friday,August 02,2019 - 04:54 by Z_CLU

ప్రస్తుతం అమెరికాలో కోలుకుంటున్న రానా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి రాబోతున్నాడు. ఈ మేరకు తన ప్రొడ్యూసర్స్ అందరికీ సమాచారం అందించాడు ఈ దగ్గుబాటి హీరో. ప్రస్తుతం తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, మరో నెల రోజుల్లో సెట్స్ పైకి వచ్చేస్తానని తెలిపాడు. మరోవైపు ట్విట్టర్ లో కూడా యాక్టివ్ అయ్యాడు.

రానా హీరోగా విరాటపర్వం సినిమా ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేసింది. అతడు లేకుండానే ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశారు. మరో షెడ్యూల్ కూడా నడుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్ లో సాయిపల్లవితో పాటు ఇతర నటీనటులపై సన్నివేశాలు తీస్తున్నారు.

విరాటపర్వంతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప సినిమా కూడా రానా చేయాల్సి ఉంది. కుదిరితే వచ్చే నెల్లోనే ఈ సినిమాను లాంఛ్ చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు హాథీ మేరీ సాథీ ప్యాచ్ వర్క్, మరో బాలీవుడ్ సినిమా రానా ఖాతాలో ఉన్నాయి.