Sobhan Babu biopic - క్లారిటీ వచ్చేసింది

Wednesday,October 14,2020 - 06:03 by Z_CLU

“తెరపైకి శోభన్ బాబు బయోపిక్. ఓ టాప్ డైరక్టర్ ఈ బయోపిక్ ఐడియాను హీరో రానాతో డిస్కస్ చేశాడంట. దీనికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.”

నిన్నట్నుంచి రౌండ్స్ కొడుతున్న ఈ రూమర్ పై క్లారిటీ వచ్చేసింది. తను శోభన్ బాబు బయోపిక్ చేయడం లేదని Rana క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. బయోపిక్ ఐడియాతో తనను ఎవరూ కలవలేదని కూడా తేల్చేశాడు.

దీంతో Sobhan Babu biopic పై నిన్నట్నుంచి వస్తున్న పుకార్లకు చెక్ పడింది.

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఓ బయోపిక్ గా తీసేంత స్టఫ్ శోభన్ బాబు జీవితంలో, కెరీర్ లో ఉంది. దానికి రానా సరిగ్గా సూటవుతాడు కూడా. కాకపోతే ప్రస్తుతానికి ఇది గాసిప్ లెవెల్లోనే ఉంది మరి.

Also Read – రానాకు ఇష్టమైన ఫుడ్