'యాక్షన్' కోసం పాట పాడిన రానా

Monday,November 11,2019 - 04:13 by Z_CLU

హీరోగా మెప్పించాడు. విలన్ గా చేశాడు. నిర్మాతగా కూడా మారాడు. టీవీ షోలు కూడా చేశాడు. ఇలా ఎన్నో రంగాల్లో రాణించిన రానా, ఇప్పుడు కొత్తగా ఇంకోటి ట్రై చేశాడు. అవును.. రానా పాట పాడాడు.

విశాల్ హీరోగా నటించిన యాక్షన్ సినిమా ప్రచారం కోసం పాట పాడాడు రానా. నిన్ననే ఈ పాట రికార్డింగ్ పూర్తయింది. పైగా ఇది రెగ్యులర్ ట్యూన్ కాదు. ర్యాప్ స్టయిల్ లో సాగే సాంగ్. పాట పాడడమే గొప్ప విషయం అనుకుంటే, ర్యాప్ స్టయిల్ లో పాడి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు.

తన సినిమా కోసం రానా పాట పాడాడనే విషయాన్ని హీరో విశాల్ స్వయంగా ప్రకటించాడు. ఆ వెంటనే రికార్డింగ్ స్టుడియోలో రానా ఉన్న పిక్స్ రిలీజ్ అయ్యాయి.

ప్రస్తుతం ఈ సాంగ్ కు ఎడిట్ సూట్ లో ఫైనల్ మిక్సింగ్ లు జరుగుతున్నాయి. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుంది. గాయకుడిగా రానా ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి