రూమర్లకు చెక్ పెట్టిన రానా

Tuesday,June 19,2018 - 11:33 by Z_CLU

హీరో రానా కిడ్ని సమస్యలతో బాధపడుతున్నాడట. రజనీకాంత్ కు ట్రీట్ మెంట్ అందించిన సింగపూర్ డాక్టర్లు రానాను కూడా ట్రీట్ చేస్తున్నారట.. ఇలా మొన్నటివరకు రానా హెల్త్ కండిషన్ పై ఎన్నో రూమర్లు వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెట్టాడు రానా. తను పూర్తి ఫిట్ గా ఉన్నట్టు ప్రకటించాడు.

అయితే తనకు ఓ ఆరోగ్య సమస్య ఉందని మాత్రం తెలిపాడు ఈ హీరో. తన కంటికి ఓ సర్జరీ అవసరం అన్నాడు. అయితే బీపీ ఎక్కువగా ఉండడం వల్ల సర్జరీ ఆలస్యం అవుతోందని, అంతకుమించి తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం హాథీ మేరీ సాథీ (అడవి రాముడు) అనే సినిమా చేస్తున్నాడు రానా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత కోడి రామ్మూర్తి బయోపిక్ లో నటించబోతున్నాడు. కంటికి సర్జరీ పూర్తయిన తర్వాత కొత్త సినిమా సంగతులు వెల్లడిస్తానని ప్రకటించాడు రానా.