రానా నిర్మాతగా చైతూ సినిమా...

Thursday,December 15,2016 - 02:24 by Z_CLU

ప్రస్తుతం హీరోగా మాంఛి ఫామ్ లోకి వచ్చేశాడు నాగచైతన్య. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ హీరో, అదే జోరు కొనసాగిస్తూ, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడీ అక్కినేని యువసామ్రాట్ మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరో రానాను నిర్మాతగా పరిచయం చేస్తూ, తను హీరోగా ఓ సినిమా చేయడాానికి రెడీ అవుతున్నాడు. తమిళ్ లో అజిత్, విజయ్ సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన కృష్ణ మరిముత్తు… ఈ ప్రాజెక్టుతో తెలుగుతెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Naga Chaitanya, Rana Daggubati @ Krishnamma Kalipindi Iddarini Movie Trailer Launch Stills

నిజానికి రానా-చైతూ కలిసి నిర్మాతలుగా మారదామని అనుకున్నారు. సొంతంగా ఓ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి, తొలి ప్రయత్నంగా ఓ హారర్ మూవీని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే అంతకంటే ముందే రానా నిర్మాతగా, చైతూ హీరోగా సినిమా ఫైనలైజ్ అయింది. ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు నాగచైతన్య. ఈ మూవీ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే, రానా నిర్మాతగా చేయబోతున్న సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.