

Saturday,July 22,2017 - 12:53 by Z_CLU
నేనే రాజు నేనే మంత్రి సినిమా చేశాడు రానా. ఈ సినిమాకు వినూత్నంగా ప్రచారం కల్పిస్తున్నారు. ఏఆర్ టెక్నాలజీ ఆధారంగా స్వయంగా రానాతో ఫొటో దిగేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ టెక్నాలజీ ఆధారంగా రాజమౌళి, రానా కలిసి ఫొటో దిగారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే పని చేశారు. ఏఆర్ టెక్నాలజీ ఆధారంగా రానాతో కలిసి ఫొటో దిగాడు.
తేజ దర్శకత్వంలో తెరకెక్కింది నేనే రాజు నేనే మంత్రి సినిమా. రానా-కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ పొలిటికల్ డ్రామాలో జోగేంద్ర అనే పొలిటీషియన్ గా రానా కనిపించనున్నాడు. ఆగస్ట్ 11న సినిమా విడుదలకానుంది.