Rana - కొత్త సినిమా టైటిల్ ఇదే

Wednesday,November 11,2020 - 04:24 by Z_CLU

లాక్ డౌన్ కంటే ముందే కొత్త సినిమా ఒకటి ఎనౌన్స్ చేశాడు రానా. మిలింద్ రావు దర్శకత్వంలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. Rana-MilindRau కొత్త సినిమా టైటిల్ ధీరుడు.

ప్రస్తుతం అరణ్య సినిమా ప్రమోషన్ లో పడ్డాడు రానా. ఈ ప్రమోషన్ తో పాటు విరాటపర్వం మూవీ ఫైనల్ షెడ్యూల్ ఒకటి పెండింగ్ లో ఉంది. ఈ రెండు కొలిక్కి వచ్చిన తర్వాత ధీరుడు స్టార్ట్ అవుతుంది. విరాటపర్వం సినిమాకు సంబంధించి ఇంకా 15 రోజుల షెడ్యూల్ బాకీ ఉంది.

ఇంతకుముందు గృహం అనే హారర్ మూవీని డైరక్ట్ చేశాడు మిలింద్ రావు. తెలుగు-తమిళ భాషల్లో ఆ మూవీ హిట్టయింది. ప్రస్తుతం ఈ దర్శకుడు, ధీరుడు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను నిర్మించనున్నారు.

Also Read – బాబాయ్ తో రానా