నయనతార, రానా మరోసారి జతగా...

Monday,October 14,2019 - 08:27 by Z_CLU

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలో నయనతార, రానా జంటగా నటించబోతున్నారు. ఇది అఫీషియల్ గా కన్ఫమ్ అయిన న్యూస్ కాదు.. సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్న టాక్.

రానా రీసెంట్ గా ఓ కొరియన్ కాప్ డ్రామా రైట్స్ ని దక్కించుకున్నాడని  తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం కీర్తి  సురేష్ ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగిందట. కీర్తి డేట్స్ సర్దుబాటు చేసుకోలేక నో అని చెప్పడంతో, ఇప్పుడు సీన్ లోకి నయనతార వచ్చింది. గతంలో కూడా ‘కృష్ణం వందే జగద్గురుం’ లో వీళ్ళిద్దరూ జంటగా నటించారు.

ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించే ఆలోచనలో ఉన్నాడు రానా. ఓ సారి డైరెక్టర్ దగ్గరి నుండి మిగతా టెక్నీషియన్స్ వరకు ఫైనలైజ్ అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.