రానా హారర్ సినిమా చేయబోతున్నాడా?

Wednesday,February 20,2019 - 12:57 by Z_CLU

ప్రస్తుతం రానా చేతిలో 4 సినిమాలున్నాయి. అతడు ఏ రోజు ఏ సినిమా సెట్స్ పై ఉంటున్నాడో కూడా చెప్పడం కష్టంగా మారింది. ఇలాంటి టైమ్ లో ఎవరైనా చేతిలో ఉన్న సినిమాలు తొందరగా పూర్తిచేయాలనుకుంటారు. కానీ రానా మాత్రం ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళ దర్శకుడు మిలింద్ తో కలిసి ఓ ప్రాజెక్ట్ లాక్ చేశాడు.

సిద్దార్థ్ హీరోగా నటించిన గృహం లాంటి సూపర్ హారర్ థ్రిల్లర్ తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు డైరక్టర్ మిలింద్. ఆ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు రానాతో మరో డిఫరెంట్ సబ్జెక్ట్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నాడు. ఇప్పటివరకు తెలుగులో ఏ హీరో చేయని డిఫరెంట్ క్యారెక్టర్ ను ఇందులో రానా చేయబోతున్నాడట. మూవీ హారర్ జానర్ లోనే ఉండే ఛాన్స్ ఉంది.

ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాని విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై ఆచంట గోపీనాధ్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ నిర్మాత నయనతార నటించిన అంజలి సీబీఐ సినిమాను విడుదల చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత రానా కొత్త సినిమాపై మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.