చంద్రబాబు నాయుడిలా రానా పర్ఫెక్ట్ ఛాయిస్

Wednesday,September 12,2018 - 03:37 by Z_CLU

వినాయక చవితి సందర్భంగా NTR బయోపిక్ లోని రానా లుక్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమాలో  రానా చంద్రబాబు నాయుడిలా కనిపించనున్నాడనే విషయం తెలిసిందే. అయితే 1984 లో యంగ్ చంద్రబాబులా ఉన్న రానా, పర్ఫెక్ట్ చాయిస్ అనిపించుకుంటున్నాడు.

 

ఈ సినిమాలో సుమంత్ ANR రోల్ లో కనిపించనున్నాడు. అయితే ఈ కాంబినేషన్ లో ఉండే సీన్స్ ని ప్రస్తుతం తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.  ఈ రోజు నుండి సెట్స్ పైకి వచ్చేశాడు సుమంత్.

క్రిష్ డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుందీ సినిమా.  బాలీవుడ్ నటి విద్యాబాలన్ బసవతారకం రోల్ కనిపించనుంది. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు వర్ధన్ ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి  M.M. కీరవాణి మ్యూజిక్ కంపోజర్.