Pawan Rana Movie - సెట్స్ పైకి మరో హీరో

Friday,January 29,2021 - 11:42 by Z_CLU

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలను, ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సాగర్.కె.చంద్ర.

ఇప్పుడీ సెట్స్ పైకి రానా కూడా వచ్చాడు. పవన్-రానాల మధ్య యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తున్న విషయం తెలిసిందే.

సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.